పేజీలు

Thursday, August 29, 2013

నా మనసులోని భావం..



నీ కన్నుల వెలుగులో శయనించాలని ఉంది,
కాని నా చూపు నిన్ను వెతకడంలో తడబడుతుంది..

నీ అధరాల తీయదనాన్ని ఆస్వాదిన్చాలని ఉంది,
కాని నా  సిగ్గు వద్దొద్దని ఆపుతుంది..

నీ చిరున్నవ్వులోని హాయిలో  రేయి గడపాలని ఉంది,
నీకున్న పరిదిలో నేను నీకు తగునా అని నా మనసు సతమతమవుతుంది..

మధురమైన తేనెల మాటలలో మునుకలు వేయాలని ఉంది,
మౌనం నిన్ను దరిచేరకుండా ఆపుతుంది..

మనసులో భావాలన్ని నీతో పంచుకోవాలని ఉంది,
భావం భాషతో ఏకీభవించక మాటలురాకుండా చేస్తుంది..

నా మనసు నీరాకను గ్రహించి నీచెంతకు ఉరకలు వేయాలని ఉంది,
నాపై నీకున్న భావం ఏమిటో అర్ధంకాక పాదం వెనుకాడుతుంది..

నీతో కలిసి కలకాలం జీవించాలని ఉంది,
ఇవన్ని తెలియకుండా నిన్నెలా అంచన వేయాలో తెలియకుండా ఉంది.. 

19 comments :

  1. The Pain One Takes to Convey his/her feelings to his/her loved ones is really beautiful. Obviously, here in every word you mentioned, shows how deep you are willing to be with someone who cares you a lot.

    అందమైన భావాలు మాలికలై పూచే వేళా
    మీ అనంతమైన ఆలోచనల వారధి నుండి

    రెప్పల మాటు దాగిన కన్నులు
    రెపరెపలాడే ఊసుల లోగిళ్ళు

    కరిగి రేయంత కునుకులేక "మశకాలతొ " పోరాటాలు
    అంది వచ్చే ప్రియునికై పడే మీ ఆత్రాములో అలవోకలు

    చక్కగా వ్యక్తపరిచారు శృతి గారు

    Sridhar Bukya
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
  2. Chadivinanthavaraku prathi varusaa entho ahlaadaanichindhi madhu gaaru....chikkaga undhi venna thinattu...
    ainaa okkati letha chiguraaku venuka ravi kiranaalu daakunna kooda avi pachhani rangunu pulumukuntu kanipisthaayi kaani daagadam asaadhyamu... edho okanaadu a manasulo dhaagina prema sandhehaalu kooda priyathamamai priyamainavaariki cheruthaayi... :)

    ReplyDelete
  3. నా మనసు నీరాకను గ్రహించి నీచెంతకు ఉరకలు వేయాలని ఉంది,
    నాపై నీకున్న భావం ఏమిటో అర్ధంకాక పాదం వెనుకాడుతుంది..


    neepai nakunna bhavam neeku nijanga ippadiki ardam avadam leda priyaa.......

    ReplyDelete
  4. image neela cute ga undi dear.........

    ReplyDelete
  5. శృతి ,

    నీ మనసులోని భావాన్ని సందిగ్ధావస్థకు గురి చేయక , స్థిరం చెయ్యి . ఇంక సంకోచమే వుండదు .

    ReplyDelete
  6. ఎమ్మా శృతి ... నిన్నటి రోజున మంచి కవిత ఒకటి అల్లి వెనువెంటనే తెంచెసావ్ .. అశోక వనం లో సీతమ్మ ముత్యాల హారాన్ని తెంచినట్టు. ఆ సగం పూల 'హారం' ఇలా ఎగురుకుంటూ నా బ్లాగ్ దరిదాపుల్లో పడితే ఏరి భద్రపరిచి ఇస్తున్న.

    మేనిచాయ మెరుపు తీగలా,
    మల్లె పూల మాలకట్టి,
    జాలువారు జడనగుచ్చి,
    పిడికెడంత నడుముచుట్టి,
    పూల సజ్జ చేతబట్టి,
    గందం మెడను చుట్టి,
    హంస నడకతోడ,
    చిరు చెమటల మోముతో,
    హంస నడక నడుస్తుంటే,
    చక్కనైన చిన్నోడు,
    చెలికాడిని అన్నాడు,
    చిర్రెత్తిన చిన్నది
    చిర్రు బుర్రు లాడుతుండగా,
    నీ సొగసు చూడతరమా,
    నీ సొగసు చూడతరమా,
    గుడి గంటలు మోగగా,
    ఒప్పుకోక తప్పలేదు..

    కవిత ఆద్యంతము బాగున్నప్పుడు ఎందులకు దానిని తొలిగించెసావమ్మి ?
    punarprastaavinchinandulaku kshaminchandi.
    Regards,
    Sridhar Bukya
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
  7. మీ ' మనసు లోని భావం ' మధురం గా ఉంది ! తేట తెలుగులో !
    మీ కవితతో పాటు గా ఉన్న చిత్రాలు కూడా , మనసును చిత్తు చేస్తున్నాయి !
    ఎక్కువ మంది మీ కవితలను ' ఆస్వాదించేట్టు ' చేయాలంటే,
    మీ కవితాక్షరాలను పెద్దవి చేయాలి !
    అట్లాగే మీ బ్లాగు ను తెలుపు చేయాలి !
    అప్పుడు మీ భావాలను చక్కగా తెలుప గలరు !
    అభినందనలు !

    ReplyDelete
  8. అందమైన చక్కని చీరకట్టులో తెలుగందం.. ఆ మనసులో భావం మరీ అందం.
    హౌ.. రొమాంటిక్. చాలా బాగుంది. అలసి సొలసిన మనసులకు చక్కని విశ్రాంతి.

    ReplyDelete