పేజీలు

Thursday, March 15, 2012

కాస్త ఆలోచిద్దాం....



ఈ మద్య ప్రేమొన్మాద దాడులు ఎక్కువగా అవుతున్నాయి.
ప్రేమ పేరిట ఆడపిల్లల హత్యలు, ఆత్మహత్యలు ఇటీవల కాలంలో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియాలో బాగా ప్రచారమవు తున్నాయి.
ప్రేమ పేరిట ఇటీవల జరుగుతున్న హత్యలు ఒక వర్గానికో, కులానికో, ప్రాంతానికో పరిమితం కాలేదు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి వరకు కృష్ణా జిల్లాలో 8, అనంతపురం 4, కరీనంగర్‌ 2, నల్గొండ 1, చిత్తరు 1, గుంటరు 1, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 1, పశ్చిమ గోదావరి 1, ప్రకాశం 1, హైదరాబాద్‌ 3, ఆదిలాబాద్‌ 1 చొప్పున దాడులు నమోదయ్యాయి. ఇవి ఇంకా పెరుగుతున్నాయి.


నా ప్రియ మిత్రులారా దీని గురించి కాస్త ఆలోచిద్దాం.
 ప్రేమొన్మాద దాడులు తగ్గించడానికి ప్రయత్నించుదాం.


నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో... ప్రేమించమని వెంటపడకు.... బలవంతంగా పుట్టే ప్రేమ, కలకాలం నిలువదు తెలుసుకో... నీతో నువ్వు ఎప్పుడు ఉంటావు నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో... కాలం మారుతుంది.

Monday, March 12, 2012

ప్రేమ...



సృష్టి యొక్క బలం బలహీనత ప్రేమ.
చావు పుట్టుకలకు మద్య గల అనుబందం ప్రేమ...

ఆకాశం కోసం ఎగిసే కెరటాల ఆరాటం ప్రేమ.
ఎడారిలో ఎండమావిలో నీరు ప్రేమ...

ప్రపంచాన్ని జయించే శక్తినిచ్చేది ప్రేమ.
ద్వేషాన్ని కూడా ప్రేమతో గెలిచేది ప్రేమ..

ఆకలిని తెలుసుకొని అన్నం పెట్టె అమ్మంటే ప్రేమ.
కావలసింది తెలుసుకొని ఇచ్చే నాన్నంటే ప్రేమ...

నొప్పి తెలియని తీయ్యని గాయం ప్రేమ.
చితి మీద వున్నా నిన్ను వీడని జ్ఞాపకం ప్రేమ...

ఈ సమాజం యొక్క బలం బలహీనత ప్రేమ.
మనస్సును మైమరపించే మైకం ప్రేమ...

యవ్వనంలో కలిగే భావన ప్రేమ.
వృద్దాప్యం లో వుండే ఆప్యాయత ప్రేమ...

మరణం అంటూ లేనేలేనిది ప్రేమ.
స్నేహాన్ని సైతం విడదీసేది ప్రేమ...

ఆకాశానికి ఉవ్వెత్తున ఎగసిపడే అలజడి ప్రేమ.
చితిమీద కూడా పరిమలించెను ప్రేమ...

ఊహ లోకం లో విహరించేలా చేసేది ప్రేమ.
నిన్ను నువ్వు మరిచేలా చేసేది ప్రేమ...

కొమ్మన విరిసే కుసుమం ప్రేమ.
వెన్నెల విరిసే విరహం ప్రేమ...

గమ్యం తెలియని పయనం ప్రేమ.
చీకటిలో వెన్నెల్లా వెలుగుచుపెను ప్రేమ...

అర్ధం తెలియని రెండక్షరాల పదం ప్రేమ.
వ్యర్ధం కాని జీవిత పరమార్ధం ప్రేమ...

Wednesday, March 7, 2012

నా బ్లాగ్ మిత్రులకు హొలీ శుభాకాంక్షలు........



నా బ్లాగ్ మిత్రులకు , నా ప్రియ మిత్రులకు హొలీ శుభాకాంక్షలు..
హోలీ (సంస్కృతం: होली )అనేది రంగుల పండుగ , హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.

మన భారతదేశం వివిధరకాల ఆచారాలు,
సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే
సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర
భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల
వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా
పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది.
ఒకరిపై ఒకరు పిచికారీలతో రంగులు చిమ్ముకుంటూ సరదాగా
ఆడి పాడుకుంటారుమధుర,బృందావనంలలో
శ్రీకృష్ణుడు గోపికలతో రాసకేళి గడిపిన చోట శ్రీ కృష్ణుని విగ్రహాలపై రంగులు
పూసి హొలీ జరుపుకుంటారు.
అందరికీ హొలీ శుభాకాంక్షలు!


Tuesday, March 6, 2012

నీ స్నేహం....



సెలయేరు లా సాగే నా జీవితం.
నీ రాకతో నదీప్రవాహం అయింది,
కట్టలు తెంచుకు ప్రవహించింది,
నీవు నిష్క్రమించాక గతి తప్పి పోయింది,
సాగర తీరం చెరకా వొంటరిగా సాగిపోతుంది.....

Saturday, March 3, 2012

నీ జ్ఞాపకాలు.........


పరవళ్ళు తొక్కె సేలఏరు లాంటి నీనవ్వు
నా మనసు వీడిపోలేదు
నీ స్నేహం నన్ను విడిపొయినా
నీ జ్ఞాపకాల జడివాన నన్ను వీడలేదు
అప్పటికీ నేను..నీకోసమే ఉంటున్నా నీ ఉహాల్లో విహరిస్తున్నా........